నిన్ను నీవే తెలుసుకో నిరుహేతుకబంధుఁడ -
వన్నిటాఁ బరతంత్రుఁడ నంతేపో నేను
వన్నిటాఁ బరతంత్రుఁడ నంతేపో నేను
యేమి గూడీ నేగర్మ మిలపైఁ జేయఁగ నీకు
యేమి మానె నేగర్మ మిటు మానఁగ
భూమినీనాటక మేల పూర్ణ కాముఁడవు నీవు
కామించి కాతువుగాక కరుణానిలయ
యేమి మానె నేగర్మ మిటు మానఁగ
భూమినీనాటక మేల పూర్ణ కాముఁడవు నీవు
కామించి కాతువుగాక కరుణానిలయ
యెంత గూడపెట్టితి నే నిలమీఁదఁ బుట్టఁగాను
యెంత నష్టినే జనించ కిట్టుండగా
వింతగుయీయుక్తులెల్ల వృథావాదము లింతే
సంతతము ననుఁ గావు సర్వేశ్వరా
యెంత నష్టినే జనించ కిట్టుండగా
వింతగుయీయుక్తులెల్ల వృథావాదము లింతే
సంతతము ననుఁ గావు సర్వేశ్వరా
యెవ్వరు విన్నవించేరు ఇటు నాదెస నీకు
యెవ్వరు వద్దనేరు నీ విలఁ గావఁగా
రవ్వల శ్రీవేంకటేశ రక్షింతువుగాక
అవ్వల నివ్వల శరణాగతరక్షకుఁడా
యెవ్వరు వద్దనేరు నీ విలఁ గావఁగా
రవ్వల శ్రీవేంకటేశ రక్షింతువుగాక
అవ్వల నివ్వల శరణాగతరక్షకుఁడా
Watch for audio - https://youtu.be/cin6i6Dte4Y