Friday, November 21, 2025

కన్నులఁ జూచేవు - Kannula Juchevu

కన్నులఁ జూచేవు మాతో కందువ మాటలాడేవు
కొన్నదికోలు నీకిఁక గోవిందరాజా

పవ్వళించేయప్పుడూను పాదాలొత్తే వారిద్దరు
యివ్వల నే నీతో నవ్వ నేకతమేది
దవ్వుల నుండే మమ్ముఁ దడవేవు నీవొళ్ల
కువ్వలాయ వలపులు గోవిందరాజా

యిద్దిరి చే నిమ్మపండ వేమి సేయవచ్చు నిన్ను
అద్ది నీతో మాటలాడ ననువయ్యీనా
చద్దికి వేఁడి కప్పటి జాణతనా లాడేవు
కొద్దిఁబడవు పనులు గోవిందరాజా

యిరుమొనసూదివి యెవ్వరివాఁడ వందుము
దొరవై నన్నుఁ గూడితి తొల్లె నీవు
తరవాతి చేఁతలెల్ల దక్కె నీకు నిందరిలో
గొరబై శ్రీవేంకటాద్రి గోవిందరాజా

Watch for audio - https://youtu.be/qgG7-eCkvqE 

No comments:

Post a Comment