కిం కరిష్యామి కిం కరోమి బహుళ-
శంకాసమాధానజాడ్యం వహామి
శంకాసమాధానజాడ్యం వహామి
నారాయణం జగన్నాధం త్రిలోకైక-
పారాయణం భక్తపావనం
దూరీకరోమ్యహం దురితదూరేణ సం-
సారసాగరమగ్నచంచలత్వేన
పారాయణం భక్తపావనం
దూరీకరోమ్యహం దురితదూరేణ సం-
సారసాగరమగ్నచంచలత్వేన
తిరువేంకటచలాధీశ్వరం కరిరాజ-
వరదం శరణాగతవత్సలం
పరమపురుషం కృపాభరణం న భజామి
మరణభవదేహాభిమానం వహామి
వరదం శరణాగతవత్సలం
పరమపురుషం కృపాభరణం న భజామి
మరణభవదేహాభిమానం వహామి
భావామృతం
"ఏమి చేయవలెను? ఏమి చేయుచున్నాను?” అను గొప్ప శంకకు సమాధానములేని బుద్ధిజాడ్యమును పొందుచున్నాను.
జగన్నాధుడైన నారాయణుని, ముల్లోకముల చేత పారాయణము చేయబడు వానిని భక్తులను పునీతులను చేయువానిని నేను నాకు దూరము చేసికొనుచున్నాను. ఏలననగా నేను దుర్మార్గముల చేతను, సంసార సాగర నిమగ్నమగు చంచలత్వము చేతను పీడించబడుచున్నాను కదా!
తిరువేంకటాచాలాధిపతిని, గజేంద్ర సంరక్షకుని, శరణాగతవత్సలుని, పరమపురుషుని, కృపయే ఆభరణముగా గలవానిని, నేను భజించుకున్నాను. పైగా మరణమే సహజ లక్షణముగా గల నా ఈ దేహమునందు వల్లమాలిన అభిమానమును పొందియున్నాను. ఏమి చేయవలెను ప్రభూ!
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/nNY1YxfHtBI