హరి నీయనుమతో అది నాకర్మమో
పరమే యిహమై భ్రమయించీని
పరమే యిహమై భ్రమయించీని
కలుగదు శాంతము కటకట బుద్ధికి
చలమున నింతాఁ జదివినను
నిలువదు చిత్తము నీపై చింతకు
పలుసంపదలను బరగినను
చలమున నింతాఁ జదివినను
నిలువదు చిత్తము నీపై చింతకు
పలుసంపదలను బరగినను
తగులదు వైరాగ్యధన మాత్మకును
వొగి నుపవాసము లుండినను
అగపడదు ముక్తి ఆసలనాసల
జగమింతా సంచరించినను
వొగి నుపవాసము లుండినను
అగపడదు ముక్తి ఆసలనాసల
జగమింతా సంచరించినను
విడువదు జన్మము వివేకముననే
జడిసి స్వతంత్రము జరపినను
యెడయక శ్రీవేంకటేశ్వర నీవే
బడిఁగాచితి విదె బ్రదికితి నేను
జడిసి స్వతంత్రము జరపినను
యెడయక శ్రీవేంకటేశ్వర నీవే
బడిఁగాచితి విదె బ్రదికితి నేను
భావవివరముః
అన్నమయ్య యేమని వాపోతున్నారో ఆలకించండి. ఓ శ్రీహరీ! శాంతి లభించుటలేదు. మొండిపట్టుదల పోవటం లేదు. వైరాగ్యం వెలయుట లేదు. ముక్తి మార్గం అడియాసే అయింది. మరి ఇదంతా నీ అనుమతితోనే జరుగుతున్నదా? లేక నా కర్మమా? పరము అనేది లేనే లేదేమో!! ఇహమే పరమనే భ్రమ కలుగుతోంది అంటున్నారు. కటకటా! (అయ్యయ్యో) ఈ నాబుద్ధికి యెన్నటికి శాంతి కలుగదు. ఇంత చదివినా పంతము వదలుట లేదు. చిత్తమునీపై నిలుచుట లేదు. అనేక సంపదలు అంది వచ్చినను. అది నీ ప్రసాదముగా గ్రహించలేకపోతున్నాను. ఇదిట్లా వుండగా ఆత్మలో వైరాగ్య ధనం తగులుట లేదు. పేరుకి వుపవాసదీక్షలు చేస్తున్నాను. కాని వాటి వలన ఫలితం శూన్యం. ఎన్ని తీర్థయాత్రలు చేసినా ముక్తి మార్గం కనుపించుట లేదు. అది "ఆశ"గానే మిగిలిపోయింది. పోనీ ఆత్మవిచారము అలవరచుకొని స్వతంత్రముగా జీవన్ముక్తి పొందాలని ప్రయత్నిస్తే ఈ జన్మము నన్ను విడువదు. అన్నీ ఆలోచనలేగాని ఆచరణ ఆమడదూరం అన్నట్లు వున్నది నా పరిస్థితి. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవే నన్ను విడువక నాపై దయగొని కాచితివి. ఇందువలన నేను బ్రతికిపోయాను.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)
* జడిసి - ప్రకటించి *తగులదు పట్టుకొనదు

Watch for audio - https://youtu.be/4KWuDBaAGlI
No comments:
Post a Comment