తగునయ్య హరి నీకు దానము దెచ్చుకొనిన
జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి
జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి
కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగా
సమ్మతించి రుక్ష్మిణి జయలక్ష్మి
అమ్ము మొనను జలది నడఁచి లంక సాదించి
కమ్మరఁ జేకొన్నసీతే ఘనవీరలక్ష్మి
సమ్మతించి రుక్ష్మిణి జయలక్ష్మి
అమ్ము మొనను జలది నడఁచి లంక సాదించి
కమ్మరఁ జేకొన్నసీతే ఘనవీరలక్ష్మి
నరకాసురు నడఁచి నవ్వుతాఁ జేయివేసితివి
సరిగా సత్యభామే పో సంగ్రామలక్ష్మి
హిరణ్యకశిపుఁ గొట్టి యింద్రాదులకు నీచే
వరమిప్పించినయాకే వరలక్ష్మి
సరిగా సత్యభామే పో సంగ్రామలక్ష్మి
హిరణ్యకశిపుఁ గొట్టి యింద్రాదులకు నీచే
వరమిప్పించినయాకే వరలక్ష్మి
నిండినవురముమీఁద నిఖిలసంపదలతో
అండనుండే యాకెపో ఆదిలక్ష్మి
మెండగుశ్రీ వేంకటాద్రిమీఁద నీసరుస నేఁగే
గండుమీరెఁ గళలతోఁ గల్యాణలక్ష్మి
అండనుండే యాకెపో ఆదిలక్ష్మి
మెండగుశ్రీ వేంకటాద్రిమీఁద నీసరుస నేఁగే
గండుమీరెఁ గళలతోఁ గల్యాణలక్ష్మి
భావామృతం :
ఓ శ్రీహరీ! నీకొక్కనికే తగును. నీకే హక్కు ఏ సౌభాగ్యమునైనా నీవీయగలవు. దానముగా నీవు తెచ్చుకొనిన ఈ జగములో భూకాంత నీది అయిన సౌభాగ్యలక్ష్మి (వామనావతారంలో ఆయన జగత్తులోని లోకాల నన్నింటిని త్రివిక్రముడై బలి చక్రవర్తినుంచి సర్వ హక్కులతో దానంగా స్వీకరించాడు)
ప్రభూ! కిమ్ముల శిశుపాలుని (అంటే అల్పముగా భావించు శిశుపాలుని) గెలిచి, తన సమ్మతిని బ్రాహ్మణుని ద్వారా తెలిపిన రుక్మిణీదేవిని స్వీకరించితివి. ఆమెయే నీకు స్వంతమైన జయలక్ష్మీ. బాణమును సంధించి జలధిని అణచి వారధి నిర్మించి లంకలో రావణుని తుదముట్టించి, కమ్మర (కమ్మర అంటే మరల అని అర్థం) సీతాదేవిని చేకొనినావు. ఆమే నీకు స్వంతమైన వీరలక్ష్మి.
ప్రభూ! నీవు మూర్ఛిల్లితివని ఆగ్రహించి నరకాసురుని తుదముట్టించిన సత్యభామపై నవ్వుతూ నీచేతిని వేసినావు. ఆమెయే పో నీ సంగ్రామలక్ష్మి. హిరణ్యకశిపుని చీల్చి నరసింహరూపమున నీవు ఆగ్రహోదగ్రుడవై యుండగా నిన్ను శాంతపరచి ఇంద్రాదులకు అనేక వరములిప్పించిన ఆ దేవియే వరలక్ష్మి వలె మమ్మనుగ్రహించుచున్నది.
ప్రభూ! సువిశాలమైన నీవురముపై ఆవాసమై సమస్త సంపదలను అనుగ్రహించి అండయై నిలిచే ఆ తల్లినే పో మేమందరమూ ఆదిలక్ష్మిగా కీర్తిస్తున్నాం. ఇకనేడు అతిశయించిన వేంకటాచలం మీద ఓ వేంకటేశ్వరా! నీ సరసనే వుండి నీతో వూరేగుతూ కళల కాణాచియైన ఈ జగజ్జననియే నీ నిత్యవధువు అయిన అలమేలు మంగమ్మ. ఆమెయే కళ్యాణ లక్ష్మి.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/6DmVU-NJfr8
No comments:
Post a Comment