Saturday, February 7, 2026

పెట్టని కోటిందరికిఁ - Pettani Kotindariki

పెట్టని కోటిందరికిఁ బెండ్లికొడుకు బొమ్మ-
బెట్టె నసురలకెల్ల బెండ్లికొడుకు

పెల్లగించి భూమెత్తీఁ బెండ్లికొడుకు వాఁడె
పిల్లఁగోవి రాగాల పెండ్లికొడుకు
పెల్లైన యీవుల పెండ్లికొడుకు వాఁడె
పిల్లఁదీపుపెన్నుద్ది పెండ్లికొడుకు

పెంచెపు శిరసుపాగ పెండ్లికొడుకు గుం-
పించిన కోపగించీఁ బెండ్లికొడుకు
పెంచకప్పుడే పెరిగెఁ బెండ్లికొడుకు వల-
పించెఁ జక్కనిసిరిఁ బెండ్లికొడుకు

పెంట పెరుగులదొంగ పెండ్లికొడుకు భూమిఁ
బెంటి పోతులఁ గూరిచెఁ బెండ్లికొడుకు
గెంటులేని వేంకటగిరిమీఁదను వాఁడె
పెంట వెట్టుకున్నవాఁడు పెండ్లికొడుకు

Watch for audio - https://youtu.be/XVtAHrLMf80 

No comments:

Post a Comment