Saturday, February 7, 2026

ఏఁటిసుఖము మరి - Eti Sukhamu Mari

ఏఁటిసుఖము మరి యేఁటిసుఖము నొక-
మాటమాత్రమున నటమటమైన సుఖము

కొనసాగుదురితములె కూడైన సుఖము
తనువిచారములలో దాకొన్న సుఖము
పనిలేనియాసలకుఁ బట్టయిన సుఖము
వెనకముందరఁ జూడ వెరగైన సుఖము

నిందలకులోనైన నీరసపు సుఖము
బొందికిని లంచంబుపుణికేటి సుఖము
కిందుపడి పరులముంగిలి గాచుసుఖము
పందివలె తనుఁదానె బ్రదికేటి సుఖము

ధృతిమాలి యిందరికి దీనుఁడగు సుఖము
మతిమాలి భంగములు మఱపించు సుఖము
పతివేంకటేశుకృప పడసినది సుఖము
యితరంబులన్నియును నీపాటి సుఖము

Watch for audio - https://youtu.be/0ZFNqJX5C4w 

No comments:

Post a Comment