Saturday, February 7, 2026

ఇందిరకు నురము - Indiraku Nuramu

ఇందిరకు నురముమీఁదిచ్చిన నాఁడు
విందువలె హరి యిందు విచ్చేసె నాఁడు

పరమపదమునందు బహుదివ్యవరణాలు
హరి గరిమలు పొలుపలరు నాఁడు
గరుడఁడు ననంతుఁడుఁ గదిసి సేనేశుఁడు
హరి నిత్యసేవకులై రిందు నాఁడు

పాల జలధిలోనఁ బవళించి హరి వచ్చి
భూ లోకమింతయుఁ జూచి పొగడునాఁడు
పాలించి నేలయు మిన్ను బహు దివ్య దేశాలు
గాలించి కోనేటిదరి గైగొంట నాఁడు

నరసురోరగులెల్ల నలువంకఁ గొలువంగ
పురవైన వేడుకలఁ బొదలునాఁడు
విరజానదియుఁ దాను వేంకటపతి వచ్చి
పరమపద మిదని పాలించె నాఁడు

Watch for audio - https://youtu.be/Yx38yxx5-2s 

No comments:

Post a Comment