ఒఱపో మెఱుపో వొయ్యారమో నీకు
వెఱతుమయ్య గోవిందుఁడా
వెఱతుమయ్య గోవిందుఁడా
కపటమో నిజమో కరుణయొ కోపమో
వుపచారమో వుపతాపమో
నిపుణత తనపై నెయ్యమే సేసేవు
విపరీతము గోవిందుఁడా
వుపచారమో వుపతాపమో
నిపుణత తనపై నెయ్యమే సేసేవు
విపరీతము గోవిందుఁడా
ననుపో నగవో నయమో ప్రియమో
చనవో చలమో సరసమో
కనుకూరిమియో గయ్యాళితనమొ
వెనుతగిలేవు గోవిందుఁడా
చనవో చలమో సరసమో
కనుకూరిమియో గయ్యాళితనమొ
వెనుతగిలేవు గోవిందుఁడా
మంకో మరులో మదమో ముదమో
జంకో లంకో జగడమో
శంకలేక నను సరుగనఁ గూడితి
వేంకటగిరి గోవిందుఁడా
జంకో లంకో జగడమో
శంకలేక నను సరుగనఁ గూడితి
వేంకటగిరి గోవిందుఁడా
తాత్పర్య వివరణ:
ఓ గోవిందుడా! మాకేమి తెలియుటలేదు. నీ దివ్యసౌందర్యము, నీమేని ప్రకాశము వర్ణించనలవికానిది. నీ ఒయ్యారమును యెంత చూచినా తనివి తీరుటలేదు. అప్పుడప్పుడు నీవంటే భయంకూడా కలుగుతుంటుంది.
నిన్ను చూచి మేమేమీ నిశ్చయం చేసికోలేకపోతున్నాము. నీవు కపటివో, నీ ప్రవర్తన నిజమైనదో, నీవు కరుణాంతరంగుడవో కోపిష్టివో, నీవు మాకు చేసేది ఉపచారమో, నెయ్యమో తెలియుటలేదు. ఈ విధంగా లెక్కించలేని భావాలు కలుగుతున్నాయి.
ఓ గోవిందుడా! నీవు వద్దన్నా మావెంటబడతావు. అది ననుపో (నీకు మాపైన అనురాగమో, (నవ్వులాటయో) నయమో (అనుకూలతయో) ప్రియమో (ప్రేమో) చనువో లేక ప్రణయతాపమో తెలియుట లేదు. నీవు నాపై చూపిస్తున్నదంతా కూరిమియో గయ్యాళితనమో తెలియుటలేదు. కృష్ణా! వద్దన్నా నా వెనుతగిలేవు (వెంటపడతావయ్యా!) గోవిందుడా!
నీ ఆలోచనలనర్ధం చేసుకోలేకపోతున్నాను. నీది మంకుతనమో మరులో (వలపులో) మదమో (గర్వమో) సంతోషమో, జంకో (భయమో) లంకో (సంకోచమో) తెలియుటలేదు. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు శంక అనునది లేక నన్ను కూడితివి. నీవు వేంకటగిరి గోవిందుడవు ప్రభూ!
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/WnWVcnsJkYQ
No comments:
Post a Comment