సులభమా మనుజులకు హరిభక్తి
వలనొంది మరికదా వైష్ణవుఁడౌట
వలనొంది మరికదా వైష్ణవుఁడౌట
కొదలేని తపములు కోటానఁగోటులు
నదన నాచరించి యటమీఁద
పదిలమైన కర్మబంధము లన్నియు
వదలించుకొనికదా వైష్ణవుఁడౌట
నదన నాచరించి యటమీఁద
పదిలమైన కర్మబంధము లన్నియు
వదలించుకొనికదా వైష్ణవుఁడౌట
తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య
అనఘుఁడై చేసినయటమీఁద
జననములన్నిట జనియించి పరమపా-
వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట
అనఘుఁడై చేసినయటమీఁద
జననములన్నిట జనియించి పరమపా-
వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట
తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు-
నరలేక సేవించినటమీఁద
తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ
వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట
నరలేక సేవించినటమీఁద
తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ
వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట
Watch for audio - https://youtu.be/eIDte8-iwD4
No comments:
Post a Comment