Tuesday, February 24, 2026

తోరణములే దోవెల్లా - Toranamule Dhovella

తోరణములే దోవెల్లా
మూరట బారట ముంచినలతల

కూరిమిమటములు గోపురంబులును
తేరుపడగెలే తెరువెల్లా
కోరినపండ్లు గురిసేటితరువులు
తోరములైన వెదురుజొంపములు

ఆటలుఁ దిరుపులు నందపుటురువులు
పాటలు వనవైభవమెల్లా
కూటువ నెమళ్ళు కోవిల గుంపుల
పేటలఁ దేటలపెనుఁగూటములు

వింజామరలును విసనకఱ్ఱలును
గొంజెగొడుగులే కొండెల్లా
అంజనగిరిరాయఁడు వేంకటపతి
సంజీవని పరుషల కొదవఁగను

Watch for audio - https://youtu.be/KwxCPpsCbRI 

No comments:

Post a Comment