వలపులు వలపులు వయ్యాళి
చలమరి మరుఁడును సమేళి
చలమరి మరుఁడును సమేళి
నెలఁతమోమునకు నీకనుచూపులు
నిలువున ముత్తెపు నివాళి
కొలఁదికి మీరిన గురుకుచములకును
తొలఁకు నీమనసు దువాళి
నిలువున ముత్తెపు నివాళి
కొలఁదికి మీరిన గురుకుచములకును
తొలఁకు నీమనసు దువాళి
వనితనిండు జవ్వన గర్వమునకు
ఘనమగు నీరతి కరాళి
వెనకముందరల వెలఁదిమేనికి నీ
పెనఁగు గోరికొన పిసాళి
ఘనమగు నీరతి కరాళి
వెనకముందరల వెలఁదిమేనికి నీ
పెనఁగు గోరికొన పిసాళి
పడఁతికోరికల భావంబునకును
కడుఁగడు నీతమి గయాళి
చిడిముడి మగువకు శ్రీ వేంకటపతి
విడువనికూటపు విరాళి
కడుఁగడు నీతమి గయాళి
చిడిముడి మగువకు శ్రీ వేంకటపతి
విడువనికూటపు విరాళి
భావామృతం :
వలపులు పెనవైచి కొనిన “విహారం" జరుగుచున్నది. చపలయైన భామకు, మన్మధుని మారురూపుయైన సింగార రాయనికి "కలయిక” జరుగనున్నది.
భామిని వదనమునకు నీకంటి చూపులే ముత్యాలహారతి వంటివి. ఘనస్తనద్వయంబు పైబడిన నీ తుంటరి మనస్సు “అమిత వేగముగల అశ్వము” (దాని నాపుట అసాధ్యము)
నిండు యౌవన గర్వంతోనున్న ఆ వనితకు “భీభత్సమైన” నీ రతివేగమే గొప్పగా తులతూగుతుంది. భామిని శరీరంపై ముందు వెనుక నెలకొని అతిశయించే కోరికతో వేసేవే నీ“దొంగ ఎత్తులు”అన్నీ,
ఆ యువతి కోరికల నిలయమైన భావనకు నీ అమితమైన వలపు “ధిక్కరింపు” తనమునకు (సమయుజ్జీగా నున్నవి) సరిపోయింది. సంభ్రమము కలిగిన మగువకు శ్రీవేంకటపతి యొక్క అవిశ్రాంతమైన కలయికే అనితర సాధ్యమైన “వలపు ఆరాధన”.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/zBAr2Ntv9Aw
No comments:
Post a Comment