Saturday, February 7, 2026

ఆవధరించఁగదయ్య - Avadarinchagadayya

ఆవధరించఁగదయ్య అన్నిరసములు నీవు
తివురుచునబ్బెనిదె తేనెమోవిరసము

చెలియచక్కఁదనాన శృంగారరసము
వెలయ బొమజంకెనల వీరరసము
కలయు రతికాంక్షలను కరుణారసము
అలరు మైపులకలను అద్భుతరసంబు

తరుణిసరసములను తగుహాస్యరసము
పరుషంపువిరహాన భయరసంబు
బెరయు నిబ్బరములను బీభత్సరసము
గరిమ మరుయుద్ధాన ఘనరౌద్రరసము

వనిత‌ ఆనందముల వడిశాంతరసము
ననుపుమంతనములను నవరసములు
యెనలేని శ్రీ వేంకటేశ నీతోఁ గూడి
దినదిన వినోదాల తిరమాయ రసము

Watch for audio - https://youtu.be/XqKl0Jm8w6c 

No comments:

Post a Comment