Saturday, February 7, 2026

నారాయణుని దివ్యనామము - NARAAYANUNI DIVYANAMAMU

నారాయణుని దివ్యనామము దలఁచలేక
వూరకిళ్లఁ దేరకిళ్ల కొడిగట్టుఁ బ్రాణి

వెనక జన్మించేనాఁడు వీసమైనఁ గొనిరాఁడు
తనువు విడుచునాఁడు తారముఁ గొంపోఁడు
మొనచూపి నడుమంత్రమునఁ దిరుగాడేటి
కనకముకు సొమ్మని కాచుకుండుఁ బ్రాణి

వుండక పొయ్యేటి వెల్లా వొకఁడు నిలుపలేఁడు
అండనె వచ్చేటి వెల్లా అడ్డగించలేఁడు
బండు బండై యిందుకుఁగాఁ బరులు రక్షకులంటా
గుండె లేకెవ్వరికైనాఁ గొంచపడుఁ బ్రాణి

వడి నిట్టే పనులకు వగవఁగ బని లేదు
జడియు సంసారక మొక్క సరవి గాదు
విడువని విభుఁడు శ్రీవేంకటేశుఁ డుండఁగాను
తడవి లే పట్టలేక తమకించుఁ బ్రాణి

Watch for audio - https://youtu.be/VWnYJcvRRuM 

No comments:

Post a Comment