పాపము చేరువ ప్రాణునికి
యేపునఁ బుణ్యం బేదోకాని
యేపునఁ బుణ్యం బేదోకాని
ముక్కున నున్నది ముంగోపం బిది
యెక్కువ శాంతం బిందున్నదో
చిక్కని యాసలు చేతిలో నున్నవి
గక్కున విరతే కానము గాని
యెక్కువ శాంతం బిందున్నదో
చిక్కని యాసలు చేతిలో నున్నవి
గక్కున విరతే కానము గాని
కన్నుల నున్నది కామాంధకారము
యెన్నిక విజ్ఞాన మెందున్నదో
వున్నది నాలుక నూరక దైన్యము
యిన్నిట ధైర్యం బెఱుఁగము గాని
యెన్నిక విజ్ఞాన మెందున్నదో
వున్నది నాలుక నూరక దైన్యము
యిన్నిట ధైర్యం బెఱుఁగము గాని
అవిగో తనువున ననాచారములు
యివల సద్ధర్మం బెందున్నదో
వివరి మొసఁగి శ్రీవేంకటేశ నా
భవ మీడేర్చఁగ బ్రదికితిఁ గాని
యివల సద్ధర్మం బెందున్నదో
వివరి మొసఁగి శ్రీవేంకటేశ నా
భవ మీడేర్చఁగ బ్రదికితిఁ గాని
భావ దర్పణము :
పెదతిరుమలయ్య ఈ అధ్యాత్మ కీర్తనలో మానవులు చేసే పాపపుణ్యాలమధ్య పెద్ద దూరమువున్నదో లేదో? పుణ్యమేమిటో? సద్ధర్మంబెందున్నదో? ఈ దైన్యం పోయి ధైర్యం యెప్పుడొస్తుందో? ప్రాణులకి పాపము ఇంత చేరువ అవుతుంటే మరి 'పుణ్యము' అనిదేనినంటారు? చెడుచేరువైనంతగా మంచి యెందుకు చేరువ కాదంటున్నారు. మనకు విపరీతమైన “కోపము” ముక్కుననే వుంటున్నదే!! మరి యెక్కువ శాంతము యెందున్నదో కదా! మనకు స్వాధీనముకాని ఆసలు మనచేతిలోనే వున్నవి. కాని నిర్మోహము (విముఖత్వము) మాత్రం దరిదాపులో కనుపించుటలేదు. కామముతో కళ్ళుకప్పివేయబడినవంటారే అది నా కనులముందే వున్నది. కాని యెన్నికైన విజ్ఞానము, ఆత్మజ్ఞానము యెందున్నదో తెలియవచ్చుటలేదు. నా నాలుక దైన్యంతో పరులను యాచిస్తుంటుంది. పిఱికి మాటలు మాట్లాడుతుంది. దీనికి ధైర్యమంటే యేమిటో యెలా వుంటుందో తెలియదు కానీ... యేమి దౌర్భాగ్యం!! అదిగో ఈ నా తనువు నిండా అనాచారమే. మరి ఇక్కడ సద్ధర్మంబెందున్నదో తెలియవచ్చుటలేదు. అటువంటి దుస్థితిలో శ్రీవేంకటేశ్వరుడు నాపై కృపతో నా పుట్టుకను యీడేర్చినాడు. అందువలన బ్రదికి బట్టకట్టగలిగినాము.
* వివరము - వ్యాఖ్యానము
*ముంగోపము - ఓర్పులేక తటాలున వచ్చే కోపము
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/C10Q7LyQEPg
No comments:
Post a Comment