ఇదియే కామనిదాన మిదియే మూలధనము
యిదియే నమ్ముట గాక యితరము లేలా
యిదియే నమ్ముట గాక యితరము లేలా
'న మే భక్తః ప్రణస్యతి' యనుమాట
అమోఘమై నీ వానతియ్యఁగా
రమారమణుఁడ రతి నీ దాసుల కెల్ల
నమో హి నితరవిచారము లేలా
అమోఘమై నీ వానతియ్యఁగా
రమారమణుఁడ రతి నీ దాసుల కెల్ల
నమో హి నితరవిచారము లేలా
నాఁడు 'మా మేకం శరణం వ్రజ’ యనుమాట
పోడిమి దిక్కుల నీ వెప్పుడు చాటఁగా
నేఁడు నీ దాసులమై నెరవేరితిమి గాక
వేఁడి వేఁడి కర్మపువిధులిడ నేలా
పోడిమి దిక్కుల నీ వెప్పుడు చాటఁగా
నేఁడు నీ దాసులమై నెరవేరితిమి గాక
వేఁడి వేఁడి కర్మపువిధులిడ నేలా
ఆల 'యెగక్షేమం వహామ్యహ' మ్మనుమాట
అలరుచు తుదిపదమై వుండఁగా
నెలవై శ్రీవేంకటేశ నిన్నుఁ గొలిచినమాకుఁ
గలిగె నీ కరుణ యే కథలు నేలా
అలరుచు తుదిపదమై వుండఁగా
నెలవై శ్రీవేంకటేశ నిన్నుఁ గొలిచినమాకుఁ
గలిగె నీ కరుణ యే కథలు నేలా
Watch for audio - https://youtu.be/XNHPy-YORDk
No comments:
Post a Comment