Friday, November 21, 2025

తలపోసి తలపోసి - Thalaposi Thalaposi

తలపోసి తలపోసి తమకించీ నామనసు
చెలులాల ఆతఁ డేమి సేసీనొకో

యెలయించినవాఁడు ఇంటికి రాఁడొకొ
చెలుల నంపితి మాఁట చేకొనెనొకా
కలువల వేసినాఁడు కరుణించకుండునొకొ
సొలసి చూచినవాఁడు చుట్టమై చిక్కఁడొకొ

మచ్చికచల్లినవాఁడు మంతనములాడడొఁకొ
ఇచ్చగించినాఁడు చనవియ్యఁడొకొ
కచ్చు పెట్టినవ్వేవాఁడు కప్పురవిడె మీఁడొకొ
వచ్చినవాఁడిఁకను నావద్దనే వుండీనొకొ

వేడుక సేసినవాఁడు వీడుజోడై చొక్కఁడొకొ
వాడికచూపినవాఁడు వసమౌనొకొ
యీడనె శ్రీ వేంకటేశుఁడిన్నిటాను నన్ను నేలె
కూడినవాఁడు నాబత్తి గొబ్బన మెచ్చునొకొ

Watch for audio - https://youtu.be/TSB0rq_oEqg 

No comments:

Post a Comment