Saturday, November 8, 2025

రాతిరెల్ల సతులతో - Raatirella Sathulato

రాతిరెల్ల సతులతో రతుల నలసెనేమో
రీతిగాదు హరి నెచ్చరికెసేయరే

పైపైఁ బొద్దువొడచి పంకజములు విరిసె
గోపగోవిందుని మేలుకొనుమనరే
దీపములు దెల్లఁబారె తిమిరమింతయు జారె
శ్రీపురుషోత్తమునిఁ జేయంటి లెమ్మనరే

కలువలు ముకుళించీ కలవింక లెలుగించీ
నెలఁతలు దేవదేవు నిద్రదెల్పరే
జలనిధి పొంగణఁగె చాయల చుక్కలుమాసె
వలరాచగురు నుప్పవడముగమ్మనరే

జీవులు మేలుకొనిరి చెంగలించె దరువులు
భావించి యచ్యుతు నిట్టె పలికించరే
కావి రింతయు విరిసె కడుసంధ్యకు బొద్దాయ
శ్రీవేంకటేశుని విచ్చేయుమనరే 

Watch for audio - https://youtu.be/KzWkIFObgD8 

No comments:

Post a Comment