ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు
ఆతని మానుటలెల్లా నవిధిపూర్వకము
ఆతని మానుటలెల్లా నవిధిపూర్వకము
యెవ్వనిపేరఁ బిలుతు రిలఁ బుట్టినజీవుల
నవ్వుచు మాసనక్షత్రనామములను
అవ్వల నెవ్వనికేశవాదినామములే
రవ్వగా నాచమనాలు రచియింతురు
నవ్వుచు మాసనక్షత్రనామములను
అవ్వల నెవ్వనికేశవాదినామములే
రవ్వగా నాచమనాలు రచియింతురు
అచ్చ మేదేవుని నారాయణనామమే గతి
చచ్చేటివారికి సన్యాసమువారికి
ఇచ్చ నెవ్వరిఁ దలఁచి యిత్తురు పితాళ్లకు
ముచ్చట నెవ్వనినామములనే సంకల్పము
చచ్చేటివారికి సన్యాసమువారికి
ఇచ్చ నెవ్వరిఁ దలఁచి యిత్తురు పితాళ్లకు
ముచ్చట నెవ్వనినామములనే సంకల్పము
నారదుఁడు దలఁచేటి నామమది యెవ్వనిది
గౌరినుడిగేటి నామకథ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరినామము
యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వఁడిచ్చీ వరము
గౌరినుడిగేటి నామకథ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరినామము
యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వఁడిచ్చీ వరము
Watch for audio - https://youtu.be/laPBTVgiP1w
No comments:
Post a Comment