Friday, November 14, 2025

అవాప్తసకల కాముఁడనుమాట - Avaaptasakala Kaamudanu

అవాప్తసకలకాముఁ డనుమాట నీకుఁ జెల్లె
వివేకించఁ బురుషార్థవిధి మాయందేది

మరిగి నీపై భక్తి మాకుఁ గలుగుటెల్లాను
అరసి నీవు రక్షించే ఆసకొరకే
హరి నీవు భక్తవాత్సల్యము మాపై జేయుటెల్ల
ఇరవైన నీకు నిరుహేతుకమే

కొసరుచు నిన్ను నేము కొలిచినదెల్లాను
వెస మాభారము నీపై వేయుకొరకే
వసముగా నీవు నన్ను వలెనని యేలుటెల్ల
యిసుమంతైన నిరుహేతుకమే

శ్రీవేంకటేశ్వర నీకుఁ జేయెత్తి మొక్కుటయెల్ల
నీవే మావాఁడవై మన్నించుకొరకే
ఆవటించి అంతర్యామివై నీవుండుటయెల్ల
యేవలఁ జూచిన నిరుహేతుకమే

Watch for audio - https://youtu.be/3yHsG9FnWI8 

No comments:

Post a Comment