Friday, November 14, 2025

స్వామి వేంకటరమణ - Swami Venkataramana

స్వామి! వేంకటరమణ  యేమిపరాకయ్య
నామనవి యాలించి  నను నేలవయ్య

నీవే నా తల్లివి  నీవే నా తండ్రివి
నీవే నాపాలి పెన్నిధాన మనుచు
నేవేళ నామదిలో  నెంతైన నమ్మితే
భావించి కరుణతో  బ్రోవరా వేమయ్య

ఎందరను రక్షింప  వెంత సెలవుసేయ
వందులో నేను నీ  కవుదునా బరువు
కందర్పగురుఁడ నను  కావవే యిందరిలో
సందడిని మరచేవు  స్వామీ అదేమయ్య

నిన్ను నమ్మినవాని  కన్నడ జేసితే
అన్యు లెవరైన నను  నాదరింతురటయ్య
నన్నేలు కృపతోడ  నాపాలి వేంకటరమణ
నిన్ను నమ్మితి నేను  నీవాఁడనయ్య 

Watch for audio - https://youtu.be/tWdmYOSjlvw 

No comments:

Post a Comment