Saturday, November 8, 2025

జ్ఞానయజ్ఞ మీగతి మోక్షసాధనము - Gnanayagna migathi MokshaSadhanamu

జ్ఞానయజ్ఞ మీగతి మోక్షసాధనము
నానార్థములు నిన్నే నడపె మాగురుఁడు

అలరి దేహమనేటి యాగశాలలోన
బలువై యజ్ఞానపు పశువును బంధించి
కలసి వైరాగ్యపుకత్తులఁ గోసి కోసి
వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుఁడు

మొక్కుచు వైష్ణవులనే మునిసభ గూడపెట్టి
చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి
చక్కఁగా సంకీర్తనసామగానమును చేసి
యిక్కువతో యజ్ఞము సేయించెఁబో మాగురుఁడు

తదీయగురుప్రసాదపు పురోడాశ మిచ్చి
కొద దీర ద్వయమనుకుండలంబులు వెట్టి
యెదలో శ్రీవేంకటేశు నిటు ప్రత్యక్షముచేసె
యిదివో స్వరూపదీక్ష యిచ్చెను మాగురుడు 

Watch for audio - https://youtu.be/gD1g5gqaFF0 

No comments:

Post a Comment