Saturday, November 8, 2025

పరమ వైష్ణవులభాగ్యం బిదివో - Parama Vaishnavula Bhagyambidivo

పరమవైష్ణవులభాగ్యం బిదివో
నిరతివారలకే నే మొక్కెదను

తలఁచ రొకప్పుడు ధరణి భోగములు
తలఁచ రితరమతదైవముల
తలఁతు రొకటి హరిదాసులదాస్యము
తలఁపు మోక్షములతగులమి(మె?) గాన

కోరరు బ్రహ్మదిగురుతరపదములు
కోరరు మేరువుకొనసుఖము
కోరుదురు తదియ్యకోట్ల సంగము
కోరిక భక్తితోఁ గూఁడీగాన

వొల్లరు కర్మము లొల్లరు పుణ్యము
లొల్లరహంకార మొకపరియు
వుల్లము శ్రీవేంకటోత్తము శరణని
యెల్లందుఁ దుదిపద మొక్కిరిగాన

Watch for audio -  https://youtu.be/vArrzimB5rA 

No comments:

Post a Comment