Saturday, November 8, 2025

కలలోని సుఖమే - Kalaloni Sukhame

కలలోని సుఖమే కలియుగమా,వెన్న
కలిలో నెక్కడిదె కలియుగమా

కడిగడి గండమై కాలము గడపేవు
కడుగఁగడుగ రొంపి కలియుగమా
బడలికె వాపవు పరమేదో చూపవు
గడిచీటియును నీవు కలియుగమా

కరపేవు కఱతలే మఱపేవు మమతలే
కరకఱ విడువవు కలియుగమా
తెరచీర మఱఁగింతే తెరువేల మూసేవు
గరుసేల దాఁటేవో కలియుగమా

కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు
కానీలే కానీలే కలియుగమా
పైనిదే వేంకటపతి దాసులుండఁగ
కానవా నీ విదేమి కలియుగమా 

Watch for audio - https://youtu.be/RUjFSQ_RPzE 

No comments:

Post a Comment