హరి నిన్నుఁ బిలిచీని అదివో అమ్మా
తెరమఱఁ గిఁకనేల తియ్యవమ్మా
తెరమఱఁ గిఁకనేల తియ్యవమ్మా
చిత్తరు పతిమవంటి చెలియా నీవు
యిత్తల పతికి విడె మియ్యవమ్మా
కొత్తమెఱుఁగుఁ బోలిన కోమలి
మొత్తమి కూరిమిపతిమోము చూడవమ్మా
యిత్తల పతికి విడె మియ్యవమ్మా
కొత్తమెఱుఁగుఁ బోలిన కోమలి
మొత్తమి కూరిమిపతిమోము చూడవమ్మా
బంగారుబొమ్మవంటి పడఁతి నీవు
అంగవించి పతితో మాఁటాడవమ్మా
అంగజు శరమువంటి అతివె నీకు
నంగతన మిది యాల నవ్వవమ్మా
అంగవించి పతితో మాఁటాడవమ్మా
అంగజు శరమువంటి అతివె నీకు
నంగతన మిది యాల నవ్వవమ్మా
చంచుల చిగురువంటి జవ్వని నీవు
కొంచక శ్రీవేంకటేశుఁ గూడితివమ్మా
మించుఁదమ్మిలోని యలమేలుమంగా
యెంచి యిద్దరును మమ్ము నేలరమ్మా
కొంచక శ్రీవేంకటేశుఁ గూడితివమ్మా
మించుఁదమ్మిలోని యలమేలుమంగా
యెంచి యిద్దరును మమ్ము నేలరమ్మా
Watch for audio - https://youtu.be/cpUdJ-slPaQ
No comments:
Post a Comment