ఇంకనైనఁ గరుణించవేమయ్య శ్రీ-
వేంకటేశ మాఇంటికి విచ్చేయవయ్యా
వేంకటేశ మాఇంటికి విచ్చేయవయ్యా
చింతాజలధి దాఁటఁ జెక్కుచేయి తేపసేసి
కాంత నీ కెదురుచూచీఁ గదవయ్యా
కొంతపుఁ గోరికలనే కొండవాఁకఁ దనజడ
ఇంతలో నిచ్చనసేసీ నిది చూడవయ్యా
కాంత నీ కెదురుచూచీఁ గదవయ్యా
కొంతపుఁ గోరికలనే కొండవాఁకఁ దనజడ
ఇంతలో నిచ్చనసేసీ నిది చూడవయ్యా
వెడ చింతచీఁకటికి వెలుగుగా నిట్టచూపు
కడఁగి పంజువట్టె రాఁగదవయ్య
అడరి తమకమనేఅడవి దాఁట నిట్టూర్పు
యెడ గుఱ్ఱముగఁ జేసి యెక్కె నిదె కోవయ్యా
కడఁగి పంజువట్టె రాఁగదవయ్య
అడరి తమకమనేఅడవి దాఁట నిట్టూర్పు
యెడ గుఱ్ఱముగఁ జేసి యెక్కె నిదె కోవయ్యా
మదనానలం బార్చ మంతనానఁ జెమటల
నదులు వరపి నిన్ను నవ్వెనయ్య
యిదివో శ్రీవేంకటేశ యింతలోఁ గూడగ నిన్ను
మదిరాక్షి నీపొందు మరవలేదయ్యా
నదులు వరపి నిన్ను నవ్వెనయ్య
యిదివో శ్రీవేంకటేశ యింతలోఁ గూడగ నిన్ను
మదిరాక్షి నీపొందు మరవలేదయ్యా
తాత్పర్య వివరణ:
ఓ శ్రీవేంకటేశ్వరా! నన్ను ఇంకమీదటైనా కరుణించవేమయ్యా? దయచేసి మా ఇంటికి విచ్చేయవయ్యా!
ఒక్కసారి నీ విరహమనే చింతాజలధిని దాటటానికి ఆదేవి తన చెక్కిలిపై చేర్చిన చేతినే తెప్పగా చేసినదయ్యా! ఆమె 'జడ' ఆమెను కల్లోలపరచుచున్న కోరికలనే పర్వతఝురిపై నిచ్చెనవలె సేసి, కాస్త నీ దృష్టిలో వుంచుకోవయ్యా!
ఆమె వెడ (తుచ్ఛమైన) చింత అనే చీకటికి వెలుగువలె నిట్టచూపు చక్కటి దివిటీ చేపట్టి ఆమెకు సాయము రారాదుటయ్యా? పాపం ఏమిచేయాలో తోచక ఆమె తమకము అనే అడవిని దాటటానికి తన సుదీర్ఘమైన నిట్టూర్పనే ఒక అశ్వమును చేసినది. ఎట్లాగో యెక్కి పయనిస్తున్నది. ఇదే ఆమెను యేలుకోవయ్యా!
స్వామీ నీకు తెలియందేముంది? నీ విరహమనే అనలమున (అగ్నిలలో) బడి ఆమె సతమతమగుచున్నది. మంతనాన (సమయస్ఫూర్తితో) దాన్ని ఆర్పుటకు తన చెమటలనే నదుల సహకారము ఆమె తీసికొనుచున్నది. అట్లు చేసి నేను జయించాను సుమా! అన్నట్లు చిరునవ్వు నవ్వుచున్నది. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు మాత్రం తక్కువవాడివా? ఆమెను మనస్సు పులకరించునట్లు కూడితివి. ఇక ఆ మధిరాక్షి (మదము కప్పిన కన్నులుగల స్త్రీ) నీ పొందు యెన్నడూ మరువలేదయ్యా.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/oodUX0LKv5o
No comments:
Post a Comment