Friday, November 21, 2025

విన్నపము సేయవమ్మా - Vinnapamu Seyavamma

విన్నపము సేయవమ్మా విభునికి సుద్దులు
చెన్నుగా నేమిసేతము చెప్పరమ్మా బుద్దులు

యెనలేని వలపుల యీఁతలు
మునుకొన్న నిట్టూర్పుల మోఁతలు
పొనుగొని సిగ్గుల పూఁతలు
వనితకు మరుఁడు సేసిన చేఁతలు

కలసేటి తమకపు కరఁగులు
మలయుఁ జెక్కిటి చేయి మఱఁగులు
సెలసి పయ్యెదజారు చెఱఁగులు
చెలియకే మరుఁడుసేసిన తెఱఁగులు

మరిగిన విరహపు మందులు
వెను (వెర?) కొన్నభావరతి విందులు
యిరవై, శ్రీవేంకటేశుఁ డిందులోనె వచ్చి కూడె
తరుణి కింతసేసిన తగు పొందులు 

English Lyrics
============ 
Vinnapamu seyavamma vibhuniki suddulu
Chennuga nemisetamu chepparamma buddulu 

Yenaleni valapula yeethalu
Munukonna nitturpula mothalu
Ponugoni siggula puthalu
Vanithaku marudu sesina chethulu  

Kalaseti tamakapu karagulu
Malayu jekkiti cheyi maragulu
Selasi payyedhajaaru cheragulu
Cheliyake marudusesina teragulu 

Marigina virahapu mandulu
Verakonna bhavarathi vindulu
Yiravai, Sri Venkateshu dindulone vachchi kude
Taruni kinthasesina tagu pondulu

Watch for audio - https://youtu.be/OtmCTeXuyvM 

No comments:

Post a Comment