Friday, November 21, 2025

కర్మ మెంత మర్మ మెంత - Karma Mentha Marma Mentha

కర్మ మెంత మర్మ మెంత కలిగినకాలమందు
ధర్మ మిది యేమరక తలఁచవో మనసా

చెలువల పొంతనుంటే చిత్తమే చెదురుఁగాని
కలుగనేర దెంతైనా ఘనవిరతి
వులుక కగ్గి పొంతనుంటేఁ గాఁకలేకాక
చలువ గలుగునా సంసారులకును

బంగారువోడ గంటేఁ బట్టనాస వుట్టుఁగాని
సంగతి విజ్ఞానపుజాడకు రాదు
వెంగలి యభిని దింటే వెఱి వెఱాటాడుఁగాక
అంగవించునా వివేకమప్పుడే లోకులకు

శ్రీవేంకటేశుభక్తి చేరితే సౌఖ్యముగాని
ఆవల నంటవు పాపా లతిదుఃఖాలు
చేవ నమృతముగొంటే చిరజీవియగుఁగాని
చావులేదు నోవులేదు సర్వజ్ఞులకును

Watch for audio - https://youtu.be/ukc-uGAytKI 

No comments:

Post a Comment