వాఁడె వేంకటేశుఁడనే వాఁడె వీఁడు
వాఁడి చుట్టుఁ గైదువ వలచేతివాఁడు
వాఁడి చుట్టుఁ గైదువ వలచేతివాఁడు
కారిమారసుతుని చక్కని మాటలకుఁ జొక్కి
చూరగా వేదాలగుట్టు చూపినవాఁడు
తీరని వేడుకతో తిరుమంగయాళువారి
ఆరడి ముచ్చిమికూటి కాసపడ్డవాఁడు
చూరగా వేదాలగుట్టు చూపినవాఁడు
తీరని వేడుకతో తిరుమంగయాళువారి
ఆరడి ముచ్చిమికూటి కాసపడ్డవాఁడు
పెరియాళువారిబిడ్డ పిసికి పైవేసిన
విరుల దండల మెడవేసినవాఁడు
తరుణి చేయివేసిన దగ్గరి బుజముచాఁచి
పరవశమై చొక్కి పాయలేనివాఁడు
విరుల దండల మెడవేసినవాఁడు
తరుణి చేయివేసిన దగ్గరి బుజముచాఁచి
పరవశమై చొక్కి పాయలేనివాఁడు
పామరులఁ దనమీఁది పాటలెల్లాఁ బాడుమంటా
భూమికెల్లా నోర నూరిపోసినవాఁడు
మామకూఁతురలమేలుమంగనాచారియుఁ దాను
గీముగానే వేంకటగిరి నుండేవాఁడు
భూమికెల్లా నోర నూరిపోసినవాఁడు
మామకూఁతురలమేలుమంగనాచారియుఁ దాను
గీముగానే వేంకటగిరి నుండేవాఁడు
భావామృతం :
ఓ నరులారా! వాడే వేంకటేశ్వరుడనే వాడు. వాడే మన యెదురుగానున్న వీడు (రంగనాథుడు). వాడిచుట్టూ చేతులలో కోరిన ఆయుధాలు ధరించినవాడు. 'కారిమారన్' కుమారుడు చక్కగా మాట్లాడి తనని సంతోషపరచగా విద్యాగంధంలేని అతనికి వేదముల మర్మమెల్ల గుత్తగా యెరిగించి విఖ్యాతుని జేశాడు. తీరని వేడుకతో ఈ స్వామి అలనాడు 'తిరుమంగై ఆళ్వారు' తనని అరడి చేసినా (వద్దని ఆంక్షలు పెట్టినా), ముచ్చిలి (దొంగతనంగా) తిందామని దొంగకూటికి ఆశపడ్డవాడు. (ఆవిధంగా తన భక్తునికోసం యెంతకైన తను సిద్ధమేనని మరొక్కసారి నిరూపించినాడు)
పెరియాళ్వారు (విష్ణుచిత్తులవారు) వారి కూతురైన గోదాదేవి పిసికి (వాడుకొని), పై వేచిన (తనపై వేసిన) విరుల దండలను (పూమాలలను) ప్రీతిగా మెడవేసినవాడు (తన మెడలో ధరించిన శ్రీరంగనాథుడు) చేయి వేసిన గోదాదేవిని, తన భుజము చాచి దగ్గరకు తీసికొని పరవశమై చొక్కి (పరవశించి) ఆమెను పాయలేనివాడు (వదలలేని వాడు). వీడు (ఈ రంగనాథుడు) వాడే... వాడే ఏడుకొండల వేంకటేశ్వరుడు.
తనమీద, పామరులు (విద్యాగంధంలేని అల్పులైన వారిని కూడ, పాటలెల్లా పాడమంటా (పాడండిరా కీర్తనలను) అని, భూమికెల్లా (భూలోకంలో అనేక చోట్ల) నోర నూరిపోసినవాడు. (నోటితో చెప్పి చెప్పి నూరిపోసి బోధించినవాడు). ఆ రంగనాధుని కథ ఇట్లా వుంటే... అక్కడ వేంకటాద్రిమీద (శ్రీవేంకటేశ్వరుడై) తన మామకూతురైన అలమేల్మంగమ్మ నాంచారీ, తానూ గీముగానే (నివాసముగా) నుండేవాడు.... యెవరనుకొంటున్నారు? వాడేవీడు... వీడేవాడు.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/zctNRqJ85cQ
No comments:
Post a Comment