Wednesday, March 25, 2026

సతులాల చూడరే - Satulala Chudare

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమిఁ
గతలాయ నడురేయిఁ గలిగె శ్రీకృష్ణుఁడు

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుఁడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాఁడు యీ కృష్ణుఁడు

వచ్చి బ్రహ్మయు రుద్రుఁడు వాకిట నుతించఁగాను
యిచ్చగించి వినుచున్నాఁ డీకృష్ణుఁడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చినమహిమలతో యీ కృష్ణుఁడు

కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డఁడాయ నీకృష్ణుఁడు
అదన శ్రీవేంకటేశుఁడై యలమేల్మంగఁగూడి
యెదుటనే నిలుచున్నాఁ డీకృష్ణుఁడు

Watch for audio - https://youtu.be/v-bVS5FyOfg 

No comments:

Post a Comment