Thursday, March 12, 2026

తాళపాకన్నమాచార్య - Tallapaka Annamacharya

తాళపాకన్నమాచార్య దైవమవు నీవు మాకు
వేళమె శ్రీహరిఁ గనే వెర వానతిచ్చితివి

గురుఁడవు నీవెసుమ్మీ కుమతి నై ననాకు
సరవి బ్రహ్మోపదేశము సేసితి
పరమబంధుఁడ వైనా పరికింప నీవెసుమ్మీ
వరుస నేఁ జెడకుండ వహించుకొంటివి

తల్లివైన నీవెసుమ్మీ తగిన విషయాలలో
పల్లదానఁ బడకుండా బ్రదికించితి
అల్లుకొని తోడునీడ వైనా నీవెసుమ్మీ
చిల్లరమాయలలోనఁ జెడకుండాఁ జేసితి

దాతవు నీవె సుమ్మీ తగు శ్రీవెంకటనాథు
నాతలఁపులో నిలిపి నమ్మఁ జేసితి
యేతలఁ జూచినా నాకు నేడుగడయు నీవె
ఆతల నీతల నన్ను నాడుకొని కాచితి

Watch for audio - https://youtu.be/C3UZhBLt-Gk 

No comments:

Post a Comment