Thursday, March 12, 2026

ఆహా నమో నమో ఆదిపురుష - Aha Namo Namo Adipurusha

ఆహా నమో నమో ఆదిపురుష నీకు
యీహల నేనెంతవాఁడ నెట్టు గాచితివి

లోకాలోకములు లోననించుకొన్న నీవు
యీకడ నాయాత్మలోన నెట్టణఁగితివి
ఆకడ వేదములకు నగోచరమైన నీవు
వాకుచే నీనామములఁ వడి నెట్టణఁగితివి

అన్నిటా బ్రహ్మాదులయజ్ఞభోక్తవైన నీవు
అన్నపానాదులివి యెట్టారగించితివి
సన్నుతి పూర్ణుఁడవై జనియించిన నీవు
వున్నతి నాపుట్టుగులో వొకచో నెట్టుంటివి

దేవతలచే పూజ తివిరికొనిన నీవు
యీవల నాచే పూజ యెట్టు గొంటివి
శ్రీవేంకటాద్రిమీఁద సిరితోఁ గూడిన నీవు
యీవిధి నాయింట నీవు యెట్టు (నిపుడెట్టు) నిలచితివి

Watch for audio - https://youtu.be/hFZs-RS-EDY 

No comments:

Post a Comment