Thursday, March 12, 2026

హరికృష్ణ మేలుకొను - Hari Krishna Melukonu

హరికృష్ణ మేలుకొను ఆదిపురుషా
తరవాత నా మోము తప్పకిటు చూడు

మేలుకొను నాయన్న మెల్లనే నీతోడి
బాలులదె పిలిచేరు బడి నాడను
చాలునిఁక నిద్దురలు చద్దికూళ్ళపొద్దు-
వేళాయ నాతండ్రి వేగ లేవే

కనుదెరవు నాతండ్రి కమలాప్తుఁ డుదయించె
వనిత మొకమజ్జనము వడిఁ దెచ్చెను
మొనసి మీ తండ్రి యిదె ముద్దాడఁ జెలఁగీని
దనుజాంతకుండ యిఁకఁ దగ మేలుకోవే

లేవె నా తండ్రి నీలీలలటు వొగడేరు
శ్రీవేంకటాద్రిపతి శ్రీరమణుఁడా
దేవతలు మునులుఁ జెందిన నారదాదులు
ఆవలనుఁ బాడేరు ఆకసమునందు

Watch for audio - https://youtu.be/Ek4uEDv88KM 

No comments:

Post a Comment