Wednesday, March 25, 2026

సిగ్గుమాలిన జీవుఁడు - Siggumalina Jivudu

సిగ్గుమాలిన జీవుఁడు దా
మొగ్గినచోటనే ములుగుఁ గాక

ఆలు బిడ్డలకునై యెల్లకాలము
పాలుమాలక పాటువడి
తీలుగా వచ్చితే దేవుని దూరును
యేలో నాఁడే యిది యెఱుఁగఁడా

కిమ్ముల విషయ కింకరుఁడై తా
నమ్ముడు వోయె నందులకే
కమ్ముకోవచ్చిన కర్మము దూరును
యిమ్ముల నాఁడిది యెఱుఁగఁడా

బ్రతికి యెన్పాళ్ళు భ్రమసి దేహమె
మితి లేక వోమి మిఁదటా
గతి యని శ్రీ వేంకటపతి జేరు
హితవని నాఁడె యెఱుఁగఁడా

Watch for audio - https://youtu.be/0rK5S8__8yE 

No comments:

Post a Comment