దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ
వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా
వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా
ధర్మార్థకామమోక్షతతులు నీ సోబనాలు
అర్మిలి నాలుగు వేదాలదె నీదరులు
నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు
కూర్మము నీలోఁతు వోకోనేరమ్మా
అర్మిలి నాలుగు వేదాలదె నీదరులు
నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు
కూర్మము నీలోఁతు వోకోనేరమ్మా
తగిన గంగాదితీర్థములు నీకడళ్ళు
జగతి దేవతలు నీ జలజంతులు
గగనపుఁ బుణ్యలోకాలు నీదరిమేడలు
మొగి నీ చుట్టుమాఁకులు మునులోయమ్మా
జగతి దేవతలు నీ జలజంతులు
గగనపుఁ బుణ్యలోకాలు నీదరిమేడలు
మొగి నీ చుట్టుమాఁకులు మునులోయమ్మా
వైకుంఠనగరము వాకిలే నీయాకారము
చేకొను పుణ్యములే నీ జీవభావము
యేకడను శ్రీవేంకటేశుఁడే నీవునికి
దీకొని నీతీర్థమాడితిమి కావవమ్మా
భావామృతం :
దేవదేవుడు, శ్రీదేవి తెప్పోత్సవం జరుపుకొనే ఓ కోనేటి తల్లీ! నీవు లోకములను పావనము చేయుదానివమ్మా! నీకు వేల కొలది వందనములు సమర్పించుకొనుచున్నాము. (నీమహిమను నేను ఎంతయని వర్ణించను?)
ఓ కోనేటమ్మా! ధర్మార్ధకామమోక్షములను చతుర్విధ పురుషార్ధములు నీ శోభలుగా రూపొందినవి. ఆర్మిలి (అపేక్షతో చదివే) నాలుగు వేదములు నీ నాలుగు తీరములు (ఒడ్లు). నిర్మలములైన నీ నీరు, సప్తసముద్రములలోని నీరు ఒక్క చోటచేరినంత ప్రశస్తమైనవి. గంభీరమైన నీ లోతు మంధర పర్వతమును తేల్చిన అది కూర్మము వంటిది.
ఓ కోనేటమ్మా! నీ కడళ్ళు (అలలు) గంగమొదలైన పవిత్ర నదులవంటివి. (అనేక అలలు వస్తుంటాయి కాబట్టి, ఒక్కొక్క అల ఒక్కొక్కనది అని అన్నమయ్య భావన అయి వుండవచ్చును). నీలో వున్న జలజంతువులన్నియు యక్ష, కిన్నెర, కింపురుషాది దేవతలు. నింగిలో నున్న ఊర్ధ్వలోకములన్నియు మాకు కనబడవు కానీ, నీ ఒడ్డున వున్న పలురకములైన ఎత్తయిన మేడలన్నీ ఆ పుణ్యలోకములే అనిపించుచున్నది. నీ చుట్టూ వున్న మొగిమాకులు (మొత్తం చెట్లు అన్నియూ) వేరెవరో కాదు స్వామికోసం అకుంఠిత దీక్షతో తపస్సమాధిలో వున్న మునీశ్వరులు.
ఓ కోనేటి తల్లీ! నీ ఆకారము నాకు శ్రీమన్నారాయణుని వైకుంఠమును తలపించుచున్నది. నీయందు తీర్ధస్నానముతో పొందే పుణ్యములు నీ జీవ భావము. : (నీవు కేవలం నీళ్ళుకాదు, ప్రాణమున్న తల్లివి అనే నా భావన). శ్రీవేంకటేశ్వరుడే నీ వునికి (స్థానము). ఓ కోనేటమ్మా మేము కొని (నిర్భయంగా) నీలో తీర్ధస్నానమాచరించితిమి. మమ్మల్ని కావుమమ్మా!
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/Ev5zwH9n3Wc
No comments:
Post a Comment