Sunday, October 12, 2025

ఎచ్చటఁ జూచిన నితఁడై - Yacheta Chucina Nithadai

ఎచ్చటఁ జూచిన నితఁడై కృష్ణుడు
మచ్చిక నలమేలుమంగతో వెలసీ

కొట్టరో వుట్టులు గోపాలబాలులు
యిట్టె కృష్ణుని యెదుటను
పట్టరో వారలు పాలు నేతికిని
గట్టిగ జోరునఁ గారీ నవిగో

కూడరో మూఁకలు కోలలవారలు
వేడుకఁ గృష్ణుని వెంటవెంట
ఆడుచు మెసఁగరొ అడుఁకులుఁ జక్కిలాలు
వాడల వాడల వరుసతోను

నిక్కి తీసుకోరో నెఱవాదికాండ్లు
మక్కువఁ గృష్ణుని మఱఁగునను
యెక్కరో శ్రీవేంకటేశు కొండమీఁద
పెక్కు నురుగులు పెరుగులు నివిగో

Watch for audio - https://youtu.be/mePYRgZD8ns 

No comments:

Post a Comment