విష్ణుఁడే యింతానని భావించుటే బుద్ధి
వైష్ణవుఁడై యాచార్యసేవ సేయుటే బుద్ధి
వైష్ణవుఁడై యాచార్యసేవ సేయుటే బుద్ధి
కొండవంటి తనలోని కోపము రేఁగవచ్చితే
దండనే యెచ్చరి వూరకుండుటే బుద్ధి
మెండుగా బరకాంతలమీఁదతమి వుట్టితేను
అండుకాచందుకు భ్రమయకుండుటే బుద్ధి
దండనే యెచ్చరి వూరకుండుటే బుద్ధి
మెండుగా బరకాంతలమీఁదతమి వుట్టితేను
అండుకాచందుకు భ్రమయకుండుటే బుద్ధి
అట్టె యెవ్వరయినా గృహారామాదులపై నాస
పుట్టించితేఁ వానివెంటఁ బోనిదే బుద్ధి
చుట్టపు సమ్మంధాన సోఁకితే పరబాధలు
చుట్టుకోక లోనుగాక జునుఁగుటే బుద్ధి
పుట్టించితేఁ వానివెంటఁ బోనిదే బుద్ధి
చుట్టపు సమ్మంధాన సోఁకితే పరబాధలు
చుట్టుకోక లోనుగాక జునుఁగుటే బుద్ధి
తప్పదింతా దైవికమే తనవద్దనున్నవారిఁ
దప్పులు పట్టనిదే తగిన బుద్ధి
యెప్పుడూ శ్రీవేంకటేశుఁ డెదలోన నున్నవాఁడు
చొప్పెత్తి యాతనిమూర్తి చూచుటే బుద్ధి

భావవివరముః
అన్నమయ్య చెప్పిన ఈ కీర్తనలో బుద్ధి అంటే సద్బుద్ధి అని అర్థం చేసుకోవాలి. సద్బుద్ధి అని దేనినంటారో వివరిస్తున్నారు. అంతా విష్ణుమాయయేనని భావించుటే బుద్ధి. వైష్ణవమును స్వీకరించి నీ ఆచార్యుని సేవచేయుటయే బుద్ధి, అని అంటున్నారు. తనలో కొండంత కోపమున్నా దానినణచివైచి హెచ్చరికతో మౌనంగా వూరకుండుటే బుద్ధి అనబడును. పరకాంతలమీద వ్యామోహ పడకుండా వారిపై కలిగిన భ్రమలకు లోనుగాక నిగూఢముగా వుండుటే బుద్ధి. ఎవ్వరైనా గృహములు ఆరామములు ఇస్తామని ఆశపుట్టిస్తే వారివెంట పడిపోకుండుటే బుద్ధి అనబడును. చుట్టరికములు సంబంధములు కలిసినప్పుడు పరుల వలన అనేక బాధలు కలుగుతాయి. మనము వాటికి లోనుయై పోతుంటాము. వాటిని తప్పించుకొని సుఖముగా వుండుటయే బుద్ధి అనబడును. మనకు చెడుజరిగినా అది దైవికము తప్పించుకొనుట అసాధ్యమని నమ్మి తనవద్దనున్న వారిని దోషులని తప్పు పట్టకవుంటేనే బుద్ధి. శ్రీవేంకటేశ్వరుడు తిరుమల శిఖరాలమీద మాత్రమే కాదు, మన హృదయంలోనే వుంటాడని గ్రహించి ఆయన దారిని పట్టుకొని ఆయన మూర్తిని దర్శించుటే బుద్ధి అనబడుతుంది.
* * జునుగుట - తప్పించుకొనుట
** చొప్పెత్తి - దారిని పట్టుకొని
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/vbWPhBuJ-Qs
No comments:
Post a Comment