Sunday, October 12, 2025

దైవమా నీపెరరేఁపణ - Daivamaa Neeperarepana

దైవమా నీపెరరేఁపణ లివి తప్పక వున్నవి జీవులకు
భావించి కాదనిదొబ్బి దీకొనఁగ బ్రహ్మాదులకైనను వసమా

యెక్కడ సిద్ధించు బ్రహ్మచర్యము యెదుటనే కాంతలఁ జూచినవేళను
చక్కఁగా మనోవ్యభిచారంబునఁ జలియించుం గాక
చిక్కునే విరతి ధనధాన్యంబులు చేతికి లోనయినఁ జూచి
వొక్కటియై తా నండే మగ్నమునొందించుం గాక

కలుగునే తనివి బహుపదార్థములు గక్కన నంగళ్లనుఁ జూచి
కొలఁదిమీఱఁ గడుతరితీపులతో కోరుచు నోరూరుం గాక
వలనుగ సమాధి యెటువలె దొరకొను వాజవారణంబులఁ జూచి
యెలమితోడ ముంగిళ్లనెల్లఁ జరియింపించుఁ గాక

యేరీతి నెలకొను నీమీఁదితలఁపు యిహలోకపుసౌఖ్యము చూచి
భారపులంపటములు పై దగిలించి పనులకుఁ బురికొలుపుఁ గాక
ధారుణి నే నివి గెలుచుట యెన్నఁడు తగ శ్రీవేంకటనాయక నీవే
గారవించి రక్షింపుము నీ కిది కడునుపకారంబౌఁ గాక

Watch for audio - https://youtu.be/Tx3cYTqWdus

No comments:

Post a Comment