నారాయణుఁ డీతఁడు నరులాల
మీరు శరణనరో మిమ్ముఁ గాచీని
మీరు శరణనరో మిమ్ముఁ గాచీని
తలఁచిన చోటను తానే వున్నాఁడు
వలెననువారి కైవసమెపుడు
కొలచెను మూఁడడుగుల జగమెల్లాను
కొలిచినవారిఁ జేకొనకుండునా
వలెననువారి కైవసమెపుడు
కొలచెను మూఁడడుగుల జగమెల్లాను
కొలిచినవారిఁ జేకొనకుండునా
యెక్కడఁ బిలిచినా నేమని పలికి
మొక్కిన మన్నించు మునుముగను
రక్కసుల నణఁచి రక్షించు జగములు
దిక్కని నమ్మినఁ దిరముగా నేలఁడా
మొక్కిన మన్నించు మునుముగను
రక్కసుల నణఁచి రక్షించు జగములు
దిక్కని నమ్మినఁ దిరముగా నేలఁడా
చూచినయందెల్ల చూపును రూపము
వోచికఁ బొగడిన వుండు నోటను
యేచిన శ్రీవేంకటేశుఁడే యితఁడట
చేచేతఁ బూజింప సేవలు గొనఁడా
వోచికఁ బొగడిన వుండు నోటను
యేచిన శ్రీవేంకటేశుఁడే యితఁడట
చేచేతఁ బూజింప సేవలు గొనఁడా
Watch for audio - https://youtu.be/QUyou1N9TI4
No comments:
Post a Comment