Sunday, October 12, 2025

ఎవ్వరము నేమిసేసేము - Evvaramu Nemisesemu

ఎవ్వరము నేమిసేసే మేమిగడమలు నీకు
రవ్వగా శరణంటే రక్షించుటింతే

అందరుఁ జేసినకర్మము లవి నీకు జీవనమై
అంది జీవించేవంటే నదియూఁ గాదు
కొందరు సురల(లు?)తోడై కూడిరాఁగా నసురల-
యిందరి గెలిచేవంటే నిదియూఁ గాదు

వొకచోటఁ గలవు వేరొకచోట లేవంటే-
నకటా యెంచిచూచిన నదియూఁ గాదు
మొకమిచ్చి వొకగుణమునఁ దిరిగేవంటే
సకలగుణుఁడ వాజాడయుఁ గాదు

కపట మిదనరాదు కడునవుననరాదు
వుపమించరాదు వొల్లకుండఁగరాదు
యెపుడును శ్రీవేంకటేశ నీ చిత్తమింతే
విపరీతములు లేవు వెలితీ లేదు

Watch for audio - https://youtu.be/58t0QdqGALE 

No comments:

Post a Comment