చిత్తగించి చూడవయ్య చెలిలాగు
బిత్తరపుజవ్వనము పెచ్చుపెరిగీని
బిత్తరపుజవ్వనము పెచ్చుపెరిగీని
చెలివీనులజవ్వాది చెక్కులఁ గరఁగి జారీ
వెలి నిన్నుఁ బాసినవిరహానను
మలసినకోరికలు మతిలోఁ దీఁ గెలువారీ
వలపుల చెమటలవానలను
వెలి నిన్నుఁ బాసినవిరహానను
మలసినకోరికలు మతిలోఁ దీఁ గెలువారీ
వలపుల చెమటలవానలను
వేవేగఁ బెట్టినకొప్పు వెడజారీ మూఁపుమీఁద
నీవొద్దికి వచ్చేటి నిబ్బరానను
పూవుల దండలో నిపుప్పొడి దుమ్ములురేఁగీ
కావరపునిట్టూర్పుల గాలిచేతను
నీవొద్దికి వచ్చేటి నిబ్బరానను
పూవుల దండలో నిపుప్పొడి దుమ్ములురేఁగీ
కావరపునిట్టూర్పుల గాలిచేతను
మునుకొని మొరసీని ముంజేతికంకణములు
తనివార నిన్నుఁ గూడేతమకమున
యెనసితివి శ్రీవేంకటేశ యింతలోనె యీకెను
వినయాన నీకు మొక్కీ వేడుకలను
తనివార నిన్నుఁ గూడేతమకమున
యెనసితివి శ్రీవేంకటేశ యింతలోనె యీకెను
వినయాన నీకు మొక్కీ వేడుకలను
Watch for audio - https://youtu.be/j3JDKfuZIMA
No comments:
Post a Comment