Sunday, October 20, 2024

ఎందు నీకు ప్రియమో - Yenduneeku Priyamo

ఎందు నీకు బ్రియమో యీ తెప్పతిరుణాళ్ళు
దిందువడె సిరులతో యీ తెప్పతిరుణాళ్ళు

పాలజలనిధిలోఁ బవ్వళించీ పాముతెప్పఁ
దేలుచున్న దది దెప్పదిరుణాళ్ళు
వోలి నేకోదకమై వొక్క మఱ్ఱియాకుమీఁద
తేలుచున్నదది యీ తెప్పతిరుణాళ్ళు

అమృతము దచ్చునాఁడు అంబుధిలో మంధరము
తెమలఁ దేలించు యీ తెప్పతిరుణాళ్ళు
యమునలో కాళింగునంగపుపడిగెమీఁద
తిమిరి తొక్కిన యీ తెప్పతిరుణాళ్ళు

అప్పుడు పదారువేలు అంగనల చెమటల-
తెప్పలఁ దేలిన తెప్పతిరుణాళ్ళు
వొప్పుగ శ్రీవేంకటాద్రి నున్నతిఁ గోనేటిలోన
తెప్పిరిల్లె నేఁటనేఁట యీ తెప్పతిరుణాళ్ళు

Watch for audio - https://youtu.be/dZDtWkH6cwQ 

No comments:

Post a Comment