Sunday, October 20, 2024

లంకెలూడుటే లాభము - Lankeludute Labhamu

లంకెలూడుటే లాభము యీ-
కింకరులను నలఁగెడికంటెను

జంపులఁ జంపక సరుగనఁబాసేటి-
లంపటమేపో లాభము
కంపుమోపుతోఁ గనలి శరీరపు-
కొంపలోన వేఁగుట కంటెను

యీవలనావల నేచేటి యాసల-
లావు దిగుటెపో లాభము
యేవగింతలకు నిరవగు నరకపు-
కోవులఁబడి మునుఁగుటకంటెను

తివిరి వేంకటాధిపుదాసులకృప-
లవలేశమెపో లాభము
చవులని నోరికి సకలము దిని తిని
భవకూపంబులఁ బడుకంటెను

Watch for audio - https://youtu.be/A2bPQcbNPwk 

No comments:

Post a Comment