Sunday, October 20, 2024

మునుల తపము - Munula Tapamu

మునుల తపము నదె మూలభూతి యదె
వనజాక్షుఁడే గతి వలసినను

నరహరి నామము నాలుక నుండఁగ
పర మొకరి నడుగఁబని యేల
చిరపుణ్యము నదె జీవరక్ష యదె
సరుగఁ గాచు నొకసారె నుడిగినా

మనసులోననే మాధవుఁ డుండఁగ
వెనుకొని యొకచో వెదకఁగనేఁటికి
కొనకుఁగొన యదే కోరెడి దదియే
తనుఁ దా రక్షించుఁ దలఁచినను

శ్రీవేంకటపతి చేరువ నుండఁగ
భావకర్మముల భ్రమయఁగనేఁటికి
దేవుఁడు నతఁడే తెరువూ నదియే
కావలెనంటేఁ గావకపోఁడు 

Watch for audio - https://youtu.be/TdG9B1IRMC8 

No comments:

Post a Comment