అంతటిదైవమ వటుగాఁగా
చెంత నిన్నుఁ గూర్చినదే ఘనము
చెంత నిన్నుఁ గూర్చినదే ఘనము
వెరవునఁ బంచమ వేదసారములు
సిరుల నినునుతించిననుతులు
సరవితోడి బహుశాస్త్రసంతతులు
నిరతిఁ జెప్పెడిని నీకథలు
సిరుల నినునుతించిననుతులు
సరవితోడి బహుశాస్త్రసంతతులు
నిరతిఁ జెప్పెడిని నీకథలు
కొంగుపైడియగు గురుమంత్రంబులు
సంగడి వైష్ణవసంభాషలు
నింగికి భూమికి నిజపురాణములు
సంగతిగల నీసంకీర్తనలు
సంగడి వైష్ణవసంభాషలు
నింగికి భూమికి నిజపురాణములు
సంగతిగల నీసంకీర్తనలు
వూనినవిధుల మహోపనిషత్తులు
నానాగతి నీనామములు
వీనులకును శ్రీవేంకటేశ మీ-
జ్ఞానార్థములు మిముఁ జదువుచదువులు
నానాగతి నీనామములు
వీనులకును శ్రీవేంకటేశ మీ-
జ్ఞానార్థములు మిముఁ జదువుచదువులు
Watch for audio - https://youtu.be/9F3q9sO4UsA
No comments:
Post a Comment