Saturday, October 26, 2024

ఎటువంటిరౌద్రమో - Etuvanti Roudramo

ఎటువంటిరౌద్రమో యెటువంటికోపమో
తటతట నిరువంక దాఁటీ వీఁడే

తోరంపుఁ బెనుచేతుల మల్లచఱచి
దారుణలీలఁ బెదవు లవుడుకఱచి
కారించి చాణూరుఁ గడుభంగపఱచి
వీరుఁడై యెముకలు విఱచీ వీఁడే

పిడుగడచినయట్టు పెడచేత నడిచి -
పడనీక పురములోపలఁ జొరఁబొడిచి
తొడికి చాణూరు నెత్తుక దయవిడిచి
వడివెట్టి నెత్తురు వడిచీ వీఁడే

బుసకొట్టుచును వూరుపులఁ జెమరించి
మసిగాఁగ బెదపెదమల్లుల దంచీ-
నెసఁగి శ్రీతిరువేంకటేశుఁడై మించి
ముసిముసినవ్వుల ముంచీ వీఁడే

Watch for audio - https://youtu.be/e8OHsogMQ9s 

No comments:

Post a Comment