Saturday, October 26, 2024

అన్నియు నాయందే - Anniyu Nayandhe

అన్నియు నాయందే కంటి నన్నిటివాఁడా నేనే
మున్నె నా భావముతో ముడిచివేసినది

చెలఁగి సంసారమే చింతించి సంసారినైతి
ములిగి ముక్తిదలఁచి ముక్తుఁడనైతి
పలుమతాలు దలఁచి పాషండబుద్ధినైతి
చెలఁగి శ్రీపతిఁ దలఁచి వైష్ణవుఁడనైతి

పొసఁగఁ బుణ్యముసేసి పుణ్యాత్ముఁడనైతి
పసలఁ బాపముచేసి పాపకర్ముఁడనైతి
వెస బ్రహ్మచారినైతి వేరె యాచారమున
ముసిపి మరొకాచారమున సన్యాసినైతి

వొగి నొడ్డెభాషలాఁడి వొడ్డెవాఁడనైతిని
తెగి తెలుఁగాడ నేర్చి తెలుఁగువాడనైతి
అగడై శ్రీవేంకటేశ అన్నియు విడిచి నేను
తగు నీదాఁసుడనై దాసరి నేనైతి

Watch for audio - https://youtu.be/S8dH4ZIRLTw 

No comments:

Post a Comment