కలియుగ మెటులైనాఁ గలదుగా నీకరుణ
జలజాక్ష హరిహరి సర్వేశ్వరా
జలజాక్ష హరిహరి సర్వేశ్వరా
పాపమెంత గలిగినఁ బరిహరించేయందుకు
నాపాలఁ గలదుగా నీనామము
కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు
చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు
నాపాలఁ గలదుగా నీనామము
కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు
చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు
ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను
సరిఁ గావఁగద్దుగా నీశరణాగతి
గరిమఁ గర్మబంధాలు గట్టిన తాళ్ళు వూడించ
నిరతిఁ గలదు గా నీభక్తి నాకు
సరిఁ గావఁగద్దుగా నీశరణాగతి
గరిమఁ గర్మబంధాలు గట్టిన తాళ్ళు వూడించ
నిరతిఁ గలదు గా నీభక్తి నాకు
హితమైన యిహపరా లిష్టమైనవెల్లా నియ్య
సతమై కలదుగా నీసంకీర్తన
తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ
గతి గలదుగా నీకమలాదేవి
సతమై కలదుగా నీసంకీర్తన
తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ
గతి గలదుగా నీకమలాదేవి
Watch for audio - https://youtu.be/GPZ4C2zswXw
No comments:
Post a Comment