Saturday, October 26, 2024

రామచంద్రా రామభద్రా - Ramachandra Ramabhadra

రామచంద్రా రామభద్రా రఘువీరా
నీ మహిమ దెలిసేరా నేఁటి వారు

అరయ జటాయువున కట్టె మోక్ష మిచ్చితివి
హరునివిల్లు విరిచి అలరితివి
యిరవై రాతికిఁ బ్రాణ మిచ్చితి వింతటి నిన్ను
నరుఁ డంటా నుండిరిగా నాఁటి వారు

నెమ్మది సరయువులో నించితి వైకుంఠము
పమ్మి మారుతికి బ్రహ్మపట్ట మిచ్చితివి
దుమ్ములుగ రాక్షసులఁ దుత్తుమురు సేసితివి
నమ్మిరిగా రాజవంటా నాఁటివారు

యెందునుఁ జెడని పట్ట మిచ్చితి విబీషణుని
కంది పరశురాముని నంగవించితి
యిందునే శ్రీ వేంకటేశ యెఱుఁగక దశరథ
నందనుఁడే యనిరిగా నాఁటివారు

Watch for audio -  https://youtu.be/j39v_IDQ1hc 

No comments:

Post a Comment