Saturday, October 26, 2024

సిగ్గరి పెండ్లికూఁతుర సీతమ్మ – Siggari Pendikutura

సిగ్గరి పెండ్లికూఁతుర సీతమ్మ 
దగ్గరి సింగారబొమ్మ  తలవంచకమ్మా 

అల్లనాఁడే  రాఘవుఁడు హరువిల్లు విరిచెను 
యెల్లి నేడే  పెండ్లాడీ  నిదివో నిన్ను 
యెల్లగా జనకుఁడు నిన్నిచ్చీనట వీఁడె 
వెల్లవిరి నీమాట వినవమ్మా 

అదె పెండ్లితెర  యెత్తి రండనే  వసిష్టు డుండి 
చదివీ మంత్రాలు సేస చల్లవమ్మా 
మొదల రామునికంటె ముంచి తలఁబాలు వోసి  
సుదతి యాతనిమోము  చూడవమ్మా 

కంకణదారాలు గట్టి కాలుదొక్కితివి మీరు 
పొంకాన బువ్వ మందరో  పొత్తుల నమ్మ 
వుంకువ వావిలిపాట నుండి శ్రీవేంకటగిరి 
తెంకుల నిన్నుఁ గూడి తిరుమాయనమ్మా

Watch for audio - https://youtu.be/u6Lf_BUIgD0 

No comments:

Post a Comment